- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గర్ల్ ఫ్రెండ్ అంటూ హీరోయిన్ రూమ్‌లోకి ఎంటరైన వ్యక్తి.. ఏం చేశాడు?
<p>దిశ, సినిమా: హీరోయిన్ ఎల్నాజ్ నొరౌజి వింత అనుభవాన్ని ఎదుర్కొంది. గోవాలో లేట్ నైట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆమె.. తన ఫ్రెండ్‌కు చెందిన ప్రాపర్టీలో నైట్ స్టే చేసేందుకు డిసైడ్ అయింది. అంతకు ముందు ఓ బర్త్ డే పార్టీకి కూడా అటెండ్ కావాలనుకున్న భామ.. అది కాస్త బోర్ కొట్టడంతో వెంటనే ఫ్రెండ్ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందామని అనుకుంది. అయితే రాత్రి నిద్రపట్టక తన తల్లికి వీడియో కాల్ చేస్తుండగా.. ఎవరో డోర్ […]</p>

దిశ, సినిమా: హీరోయిన్ ఎల్నాజ్ నొరౌజి వింత అనుభవాన్ని ఎదుర్కొంది. గోవాలో లేట్ నైట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆమె.. తన ఫ్రెండ్‌కు చెందిన ప్రాపర్టీలో నైట్ స్టే చేసేందుకు డిసైడ్ అయింది. అంతకు ముందు ఓ బర్త్ డే పార్టీకి కూడా అటెండ్ కావాలనుకున్న భామ.. అది కాస్త బోర్ కొట్టడంతో వెంటనే ఫ్రెండ్ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందామని అనుకుంది. అయితే రాత్రి నిద్రపట్టక తన తల్లికి వీడియో కాల్ చేస్తుండగా.. ఎవరో డోర్ ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తున్నట్లు అనిపించిందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది హీరోయిన్. తన స్నేహితులు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసి ఉంటారనుకుని.. ఫ్రెండ్స్‌తో క్రాస్ చెక్ చేసుకోగా.. అదేమీ లేదని చెప్పడంతో భయపడిపోయిందట.
విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ ఇంటికి చేరుకునే సరికి.. ఆ వ్యక్తి టెర్రస్‌పైకి ఎక్కి.. హీరోయిన్ తన గర్ల్ ఫ్రెండ్ అని అరుస్తున్నాడని, స్నేహితుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. హీరోయిన్ ఫ్రెండ్స్ ఫిర్యాదుతో ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రాతపూర్వక క్షమాపణలు చెప్పడంతో వదిలేశారు. కాగా ఈ ఘటన గురించి వ్యక్తి కుటుంబానికి కూడా సమాచారం అందించారు పోలీసులు.






