జూబ్లీహిల్స్ MLA అభ్యర్థి హఠాన్మరణం.. ఎన్ని ఓట్లు సాధించాడో తెలుసా?

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) కౌంటింగ్ ముగిసింది.

జూబ్లీహిల్స్ MLA అభ్యర్థి హఠాన్మరణం.. ఎన్ని ఓట్లు సాధించాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) కౌంటింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే.. జూబ్లీహిల్స్‌లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP) తరపున పోటీ చేసిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్(Muhammad Anwar) హఠాన్మరణం చెందారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన 24 ఓట్లు సాధించారు. అభ్యర్థి అన్వర్ మృతిపై పలువురు రాజకీయ నాయకులు తమ సంతాపం తెలియజేశారు. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా.. మెుత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈనెల 11న పోలింగ్ జరగ్గా.. నేడు ఫలితాలు వెలువడ్డాయి.




Next Story