- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇకనైనా అహంకారం తగ్గించుకుంటే బెటర్’.. జూబ్లీహిల్స్ రిజల్ట్స్‌పై CM రేవంత్ ఫస్ట్ రియాక్షన్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లకు ధన్యవాదాలు చెప్పారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు సరైన ఫలితాలు రాలేదు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్‌పై క్రమంగా నమ్మకం పెరుగుతోందని అన్నారు. గెలుపోటములకు కాంగ్రెస్ ఎప్పుడూ కుంగిపోదు.. పొంగిపోదు అని చెప్పారు. ప్రజల తరపున నిలబడటం, పోరాడటమే కాంగ్రెస్ కర్తవ్యం అని అన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి.. జూబ్లీహిల్స్‌లో తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ నేతలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆదాయంలో 65 శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తోందని.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎవరి పాత్ర వాళ్లం పోషిద్దామని పిలుపునిచ్చారు.
హైడ్రా, ఈగల్ వంటి సంస్థలు హైదరాబాద్ అభివృద్ధి కోసమే తెచ్చినట్లు తెలిపారు. కానీ వాటిపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టి మరీ తప్పుడు ప్రచారం చేసింది.. ప్రజలు వాస్తవాన్ని గుర్తించి ఓటు వేశారని అన్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం ఇకనైనా బీఆర్ఎస్ నేతలు ఆపాలని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తామని.. మిగతా సమయంలో రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడైనా మేల్కొని సచివాలయానికి రావాలి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించి.. కలిసి సాధించుకొద్దామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని అన్నారు. కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఈ ఉపఎన్నికల్లో ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క జూబ్లీహిల్స్లోనే కిషన్ రెడ్డికి 60 వేల ఓట్లు వచ్చాయి.. ఆయన అభ్యర్థిగా మారి ఇన్ని రోజులు ప్రచారం చేస్తే 17 వేల ఓట్లే వచ్చాయి.. ఇప్పటికైనా కిషన్ రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు.
మరోవైపు.. కేటీఆర్, హరీష్ రావులు ఇకనైనా అసూయ, కడుపుమంట, అహంకారం తగ్గించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. అయినా బుద్ధి రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. అప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మళ్లీ బుద్ధి చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పారు. లేకపోతే రాష్ట్రంలో బీఆర్ఎస్ కనిపించకుండా పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.. ప్రభుత్వానికి సహకరించాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Read More... Kavitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కవిత సంచలన పోస్ట్! వైరల్
వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి : శశి థరూర్ సంచలన కామెంట్స్






