- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఆరోగ్యంపై CM రేవంత్ కామెంట్
బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యేలా కూడా కనిపించడం లేదు. కేటీఆర్, హరీష్ రావులను ఎన్నాళ్లు ముందు వరుసలో నిల్చోబెడితే.. అన్నాళ్లూ బీఆర్ఎస్ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కేసీఆర్ మొఖం చూసి బీఆర్ఎస్కు ఓటు వేసేవాళ్లు కూడా వీరిద్దరు గుర్తొస్తే ఓటు వేయడం లేదు. ఇది ఇప్పటికే కేసీఆర్‌కు కూడా అర్థం అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా.. మళ్లీ కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే.. అప్పుడు నేను ఆయన గురించి మాట్లాడుతా.. అప్పటివరకు కేసీఆర్ మీద రాజకీయ విమర్శలేవీ చేయను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఎన్ని ఓటములు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మనుగడ సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించి.. అభినందనలు తెలిపారు.
Read More... ‘ఇకనైనా అహంకారం తగ్గించుకుంటే బెటర్’.. జూబ్లీహిల్స్ రిజల్ట్స్‌పై CM రేవంత్ ఫస్ట్ రియాక్షన్






