వీడిన ఉత్కంఠ.. ముఖ్యమంత్రి అభ్యర్థి విజయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-14 12:58:12  IST  )

వీడిన ఉత్కంఠ.. ముఖ్యమంత్రి అభ్యర్థి విజయం

వీడిన ఉత్కంఠ.. ముఖ్యమంత్రి అభ్యర్థి విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌(Mahagathbandhan) కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) విజయం సాధించారు. చివరి వరకూ ఉత్కంఠంగా సాగిన ఈ ఎన్నికల్లో ఎట్టకేలకు గెలుపొందారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 18 వేల ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌కు 1,19,780 ఓట్లు లభించాయి. మరోవైపు.. బిహార్‌ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఈ సారైనా గెలుపొందాలని ఎంతో కఠోరంగా శ్రమించినా తేజస్వీ యాదవ్‌కు నిరాశ తప్పలేదు. 2015లో రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన తేజస్వీ దాదాపు దశాబ్దానికి పైగా శ్రమిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయంతో తేజస్వీ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. 2015లో నీతీశ్‌తో కలిసి పోటీచేసి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. కొంతకాలం తరువాత నీతీశ్‌ తిరిగి బీజేపీతో జట్టు కట్టారు. అప్పటి నుంచి రాష్ట్రంలో తేజస్వీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.

Next Story