- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్ సీఎంకు ఈసీ షాక్..
<p>కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) షాక్ ఇచ్చింది. మతం పేరిట ప్రచారం నిర్వహించిన వివాదంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల హుగ్లీలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో దీదీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి. ముస్లింల ఓట్లు చీలకుండా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇది ఎన్ని్కల […]</p>

X
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) షాక్ ఇచ్చింది. మతం పేరిట ప్రచారం నిర్వహించిన వివాదంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల హుగ్లీలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో దీదీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి. ముస్లింల ఓట్లు చీలకుండా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఇది ఎన్ని్కల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. దీనిపై స్పందించిన ఈసీ.. బుధవారం మమతకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వని పక్షంలో చర్యలు ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. అయితే ఈ నోటీసులపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. బీజేపీపై తాము ఇచ్చిన ఫిర్యాదులకు సమాధానమేదని.. ఈసీ పక్షపాత ధోరణికి ఇదే నిదర్శనమని ఆరోపించారు.
Next Story






