- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మగోరుముద్ద అమృతం.. కానీ ఆ ముద్దకోసమే అమ్మఆరాటం
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్ : అమ్మ.. పేరులో ప్రేమని.. పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృత మూర్తి అమ్మ. అమ్మ ప్రేమ అంత తీయన కనుకే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు. అంత గొప్పది అమ్మ.. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. అంటూ ఎంతో మంది మాతృదినోత్సవం గురించి ఎన్నో పోస్టులు పెడుతున్నారు. కానీ ఆ మాతృదినోత్సవం రోజే ఎర్రటి ఎండలో ఇద్దరు మాతృమూర్తులు బుక్కెడు బువ్వకోసం భిక్షాటన […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : అమ్మ.. పేరులో ప్రేమని.. పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృత మూర్తి అమ్మ. అమ్మ ప్రేమ అంత తీయన కనుకే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు. అంత గొప్పది అమ్మ.. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. అంటూ ఎంతో మంది మాతృదినోత్సవం గురించి ఎన్నో పోస్టులు పెడుతున్నారు. కానీ ఆ మాతృదినోత్సవం రోజే ఎర్రటి ఎండలో ఇద్దరు మాతృమూర్తులు బుక్కెడు బువ్వకోసం భిక్షాటన చేస్తున్నారు. ఆస్తుల కోసం కాదు… కడుపు నింపుకునే ముద్ద కోసం ఆరాడ పడుతున్నారు. మాతృదినోత్సవం రోజు ఇద్దరు వృద్ధురాళ్లు కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్ర చౌరస్తాలో భిక్షాటన చేస్తూ అందరిచే మనసును కాకవికలం చేశారు. మనసున్న వారు ఎంతో కొంత దానం చేసి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితులు మరో తల్లికి రాకుడదని ఆశిద్దాం.
Next Story






