ఇదిగో రామా.. మా బహుమానం

by Mallepaka Hamsa |

<p>దిశ, వెబ్ డెస్క్ : ఏదైనా సృష్టించడం ఓ కల అయితే ఆ కల అందరికి ఉండదు. కొంతమంది దాన్ని దేవుడు ఇచ్చిన వరం అంటారు. ఆ దేవుడిచ్చిన వరాన్ని ఈ దేవుడి కోసం ఉపయోగిస్తున్నామంటూ.. రామాలయానికి భారీ తాళాన్ని తామే స్వయంగా తయారు చేసి ఆ రామునికి బహుమానంగా ఇవ్వనున్నారు ఓ వృద్ధ దంపతులు. అయోధ్యరామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు జరుతున్నాయి. అయితే రామ మందిరానికి ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు.  తమ వంతుగా అలీఘఢ్ జిల్లాకు [&hellip;]</p>

ఇదిగో రామా.. మా బహుమానం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏదైనా సృష్టించడం ఓ కల అయితే ఆ కల అందరికి ఉండదు. కొంతమంది దాన్ని దేవుడు ఇచ్చిన వరం అంటారు. ఆ దేవుడిచ్చిన వరాన్ని ఈ దేవుడి కోసం ఉపయోగిస్తున్నామంటూ.. రామాలయానికి భారీ తాళాన్ని తామే స్వయంగా తయారు చేసి ఆ రామునికి బహుమానంగా ఇవ్వనున్నారు ఓ వృద్ధ దంపతులు. అయోధ్యరామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు జరుతున్నాయి. అయితే రామ మందిరానికి ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు. తమ వంతుగా అలీఘఢ్ జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు రామాలయానికి భారీ తాళాన్ని విరాళంగా అందచేయనున్నారు.

ప్రకాశ్‌ శర్మ, రుక్మిణి శర్మ దంపతులకు తాళాలు చేయడంలో విశేష అనుభవం ఉంది. 40 ఏళ్లుగా వారు ఆ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రాముని కోసం 300 కిలోల బరువున్న తాళాన్ని తయారు చేయడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. తమ వంశం 100 ఏళ్లకు పైగా తాళాలు తయారు చేస్తుంది కానీ నాకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అలానే లాక్ డౌన్ లో పనిలేక సతమతమవుతున్న తమకు ఆ శ్రీరాముడే ఈ గొప్ప పని కల్పించాడన్నారు. 300 కిలోలున్న ఈ తాళాన్ని తయారు చేయడానికి ఇనుము, రాగి, ఇత్తడి ఉపయోగిస్తున్నామన్నారు. అలాగే ఈ తాళం తయారీ కోసం లక్ష రూపాయిలు ఖర్చు చేసినట్టుగా వారు తెలిపారు. సంవత్సరం నుంచి ఈ తాళం తయారు చేస్తున్నామని ఇంకో రెండు, మూడు నెలల్లో తాళం తయారీ అవుతుందని వారు తెలిపారు.

Next Story