శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అద్భుతం

by  |
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అద్భుతం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హించారు. అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు , సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed