32 నెలల గరిష్ఠానికి ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి

by  |
32 నెలల గరిష్ఠానికి ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక వృద్ధిని సూచించే ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి 2021, మార్చి నెలలో 32 నెలల గరిష్ఠంతో 6.8 శాతానికి చేరుకుంది. గతేడాది మార్చిలో 8.6 శాతం కుదించుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.8 శాతం డీలాపడింది. గత 8 ఏళ్లలో వార్షిక కీలక రంగాల ఉత్పత్తి సంకోచించడం ఇదే మొదటిసారి అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎనిమిది ప్రధాన రంగాల్లో నాలుగు రంగాల క్షీణించాయి. బొగ్గు 21.9 శాతం పడిపోయింది. ముడి చమురు 3.1 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 0.7 శాతం, ఎరువులు 5 శాతం సమీక్షించిన నెలలో పడిపోయాయి. సహజ వాయువు ఉత్పత్తి 12.3 శాతం పెరిగింది. స్టీల్ 23 శాతం, సిమెంట్ 32.5 శాతం, విద్యుత్ 21.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మరో రెండు నెలలు ఈ రంగాల వృద్ధి ఇదే ధోరణిని కొనసాగించవచ్చవని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. నాలుగింటిలో ఉత్పత్తి పెరగడం సానుకూలంగా భావించలేమని తెలిపారు.


Next Story

Most Viewed