రంజాన్ వేళ.. టాలీవుడ్ స్టార్స్ విషెస్

by  |
రంజాన్ వేళ.. టాలీవుడ్ స్టార్స్ విషెస్
X

ప్ర‌పంచ వ్యాప్తంగా ముస్లిం సోద‌రులు ఈ రోజు (సోమవారం) రంజాన్ వేడుకలు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా సినీ సెల‌బ్రెటీలంద‌రూ వారికి రంజాన్ శుభాకాంక్ష‌ల‌ను తెలియజేశారు. టాలీవుడ్ అగ్ర నటుడు నంద‌మూరి బాల‌కృష్ణ.. వీడియో ద్వారా రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘ముస్లిం సోదర సోదరీమణులకు, పెద్దలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రేమ త్యాగాలకు ప్రతీక రంజాన్. లాక్‌డౌన్‌లో కూడా మనోధైర్యంతో కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ.. ప్రార్థనలు చేసిన మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. మీ ప్రార్థనలు ఫలించి కరోనా త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నా. అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి. ఈద్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని వేడుకుంటున్నా’ అన్నారు.

‘విషింగ్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ ఈద్.. ఈ అద్భుతమైన రోజున ఆ దేవుడు మీ అందరికీ ప్రేమ, శాంతిని పంచాలని, అడ్డంకులను ఎదుర్కొనే శక్తిని అందివ్వాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్’ – మహేశ్ బాబు

‘ఈ పండుగ రోజున మీకు సంతోషం, ఐశ్వర్యం కలగాలని ప్రారిస్తున్నాను.. ఈద్ ముబారక్’
– అల్లు అర్జున్

‘అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు మీకు సంతోషం కలగాలని కోరుకుంటున్నాను.’
– చిరంజీవి

‘ఈద్ ముబారక్ గ్రీటింగ్స్.. దేవుని ఆశీస్సులతో మీరెప్పుడూ ఐశ్వర్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను’
– పవన్ కళ్యాణ్

‘రంజాన్ శుభాకాంక్షలు’ – ఎన్టీఆర్

నాగార్జున అక్కినేని, సుధీర్ బాబు, సాయి ధరమ్ తేజ, హన్సిక, మెహ్రీన్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story