సాఫ్ట్‌వేర్ సమస్యలున్నాయి.. సరళతరం చేయాలి: ఈటల

by  |
సాఫ్ట్‌వేర్ సమస్యలున్నాయి.. సరళతరం చేయాలి: ఈటల
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్దన్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో సచివాలయం నుంచి మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు తెలిపారు. అన్ని కేంద్రాల్లో సాఫ్ట్ వేర్ పనిచేయడం లేదని చెప్పారు. సాఫ్ట్ వేర్‌లో సమస్యలు ఉన్నాయనీ..వాటిని సరళ తరం చేయాలని కోరారు. రాష్ట్రానికి మరిన్ని డోసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed