- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలెక్టర్ నివేదికలో తప్పు
<p>దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి ఈటల రాజేందర్భూ వ్యవహారంలో మెదక్‌జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో పెద్ద తప్పు దొర్లింది. సీఎస్‌కు ఇచ్చిన నివేదికలోనే తప్పు ఉండటంతో హడావుడి నివేదికను తయారు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల నుంచి తయారు చేసిన నివేదికలో బాధితుల వాంగ్మూలం వివరించిన కలెక్టర్ హరీష్… కబ్జాదారులుగా సూచించిన వారి వరుసలను మార్చేశారు. అసైన్డ్ల్యాండ్ను కబ్జా చేయడాన్ని వెల్లడించిన కలెక్టర్… జమునా హాచరీస్ జమునా భర్త నితిన్‌రెడ్డి అని సూచించారు. […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి ఈటల రాజేందర్భూ వ్యవహారంలో మెదక్‌జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో పెద్ద తప్పు దొర్లింది. సీఎస్‌కు ఇచ్చిన నివేదికలోనే తప్పు ఉండటంతో హడావుడి నివేదికను తయారు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల నుంచి తయారు చేసిన నివేదికలో బాధితుల వాంగ్మూలం వివరించిన కలెక్టర్ హరీష్… కబ్జాదారులుగా సూచించిన వారి వరుసలను మార్చేశారు.
అసైన్డ్ల్యాండ్ను కబ్జా చేయడాన్ని వెల్లడించిన కలెక్టర్… జమునా హాచరీస్ జమునా భర్త నితిన్‌రెడ్డి అని సూచించారు. వాస్తవంగా ఈటల రాజేందర్ సతీమణి జమునగా సూచించాల్సి ఉంది. కాగా, నితిన్‌రెడ్డి పేరు ఎక్కడా లేదు. నితిన్‌రెడ్డి మంత్రి ఈటల రాజేందర్– జమునారెడ్డిల కుమారుడు. కానీ జమున భర్తగా నితిన్రెడ్డిని సూచించడంపై పలు విమర్శలకు తావిస్తోంది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో ఇంత భారీ తప్పు దొర్లడంపై కొంత ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి కలెక్టర్ నివేదికలో తల్లిని తప్పుగా చూపించి చరిత్రకెక్కారు.






