Big Alert:ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

by Jakkula.Mamatha |

రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థుల(Inter Students)కు గుడ్ న్యూస్.

Big Alert:ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థుల(Inter Students)కు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఈ ఏడాది నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh) ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల(Inter Supplementary Examination) కోసం గత నెల(ఏప్రిల్) 15 నుంచి 22 వరకు ఫీజు చెల్లించాలని మొదట విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

ఈ గడువుకు పలువురు విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో గడువు పొడగిస్తూ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మే 3వ తేదీ వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ్టితో గడువు ముగియనుండగా మరోసారి విద్యాశాఖ(Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు(జనరల్/ఒకేషనల్) ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ తాజాగా మరోసారి పొడిగించింది. ఈ రోజు(మే 3)తో గడువు ముగియనుండగా మరో రెండు రోజులు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ తరుణంలో ఈ నెల(మే) 5 వరకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పొడిగింపు ఉండబోదని ఇంటర్ బోర్డు(AP Inter Board) కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి 20 తేదీ వరకు జరగనున్నాయి. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.

Next Story