- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
APRJC, APRDC సెట్ దరఖాస్తుల స్వీకరణ.. చివరి తేదీ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో రెసిడెన్షియల్ జూనియర్(APRJC), డిగ్రీ కాలేజీల్లో(APRDC) ప్రవేశాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదలైంది.

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రెసిడెన్షియల్ జూనియర్(APRJC), డిగ్రీ కాలేజీల్లో(APRDC) ప్రవేశాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి తేదీ మార్చి 31వ తేదీ ప్రకటించారు.
ఈ ఎంట్రాన్స్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు ఏప్రిల్ 17న విడుదల కానున్నాయి. ఏప్రిల్ 25న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి, మే 14న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 1,149 సీట్లు ఉండగా, డిగ్రీ కాలేజీలో 220 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో MPC, BiPC,MEC, CEC, EET, CGT గ్రూపులు ఉన్నాయి. డిగ్రీలో బీఏ పొలిటికల్ సైన్స్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీకాం ట్యాక్స్ ప్రొసిడర్స్ అండ్ ప్రాక్టీస్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ జువాలజీ కోర్సులున్నాయి. ఎంట్రన్స్ లో సాధించిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. సీటు పొందిన వారికి విద్య, వసతి సదుపాయం కల్పిస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తివివరాలకు https://aprs.apcfss.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.






