- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UGC NET ఫలితాలు విడుదల
జూనియర్ రీసెర్చి ఫెలోషిప్(JRF), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల(Assistant Proffeser Post)కు అర్హత కోసం ఏటా రెండుసార్లు యూజీసీ నెట్(UGC NET) పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే

దిశ,వెబ్‌డెస్క్: జూనియర్ రీసెర్చి ఫెలోషిప్(JRF), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల(Assistant Proffeser Post)కు అర్హత కోసం ఏటా రెండుసార్లు యూజీసీ నెట్(UGC NET) పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. తాజాగా UGC NET ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో యూజీసీ నెట్ డిసెంబర్ 2024 ఫలితాలు ఈ రోజు(ఆదివారం) ఉదయం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది.
ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక https://ugcnet.nta.ac.in/ వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం జనవరిలో పరీక్షలు జరిగాయి. ఇందుకు సంబంధించిన కీని ఈ నెల(ఫిబ్రవరి) 3వ తేదీన విడుదల చేసింది. యూజీసీ నెట్ పరీక్షకు 6.49 లక్షల మంది హాజరయ్యారు. JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 5,158 మంది, అసిస్టెంట్ ఫ్రొఫెసర్, పీహెచ్‌డీ అడ్మిషన్‌కు 48,161 మంది, పీహెచ్‌డీ కోసం 1,14,445 క్వాలిఫై అయ్యారు.






