714 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

by Jakkula.Mamatha |

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అబ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది.

714 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అబ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) 714 MTS(మల్టీ టాస్కింగ్ స్టాఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 17 నుంచి జనవరి 15లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27 మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్ లో సడలింపు ఉంది.

కంప్యూటర్ ఆధారిత (టైర్-1) పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.18,000- రూ.56,900 చెల్లిస్తారు. జనరల్ ఆవేర్‌నెస్, రిజనీంగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ల నుంచి 200 అబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులు, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అబ్యర్థులకు ఫీజు లేదు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://dsssb.delhi.gov.in/ ను సందర్శించండి.

Next Story