నీట్(యూజీ-2025) అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

by Jakkula.Mamatha |

నీట్‌(యూజీ-2025) మే 4వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న విషయం తెలిసిందే.

నీట్(యూజీ-2025) అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: నీట్‌(యూజీ-2025) మే 4వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న విషయం తెలిసిందే. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఇప్పటికే NEET UG 2025 ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో ఇటీవల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా నీట్‌ (యూజీ 2025) అడ్మిట్‌ కార్డులను కూడా రిలీజ్ చేశారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు National Eligibility Cum Entrance Test NEET అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://neet.nta.nic.in/ను సందర్శించండి.

విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 4వ తేదీన వివిధ పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది. నీట్ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ సంబంధించి ఏవైన ఇబ్బందులు ఎదురైతే 011-04759000/011-69227700 నంబర్లకు లేదా [email protected]కు ఈ మెయిల్ చేయవచ్చని అధికారులు సూచించారు.

Next Story