- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > కెరీర్ > ఎడ్యుకేషన్ > TG PGLCET: టీజీపీజీఎల్ సెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
TG PGLCET: టీజీపీజీఎల్ సెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
by Ramesh Naini |
రాష్ట్రంలో ఎల్ఎల్ఎం ప్రవేశాల ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను టీజీసెట్స్ (ఇతర) ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ జె.పాండురంగా రెడ్డి సోమవారం విడుదల చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో (TG PGLCET) ఎల్ఎల్ఎం ప్రవేశాల ఫైనల్ ఫేజ్ (Final Phase) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను టీజీసెట్స్ (ఇతర) ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ జె.పాండురంగా రెడ్డి (Panduranga Reddy) సోమవారం విడుదల చేశారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ కమ్ వెరిఫికేషన్, ఆన్ లైన్ చెల్లింపులు కోసం ఈ నెల 28 నుంచి 30 వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 31 న అర్హత గల అభ్యర్థుల జాబితా ప్రదర్శిస్తామని, అలాగే ఈ మెయిల్ ద్వారా ఏమైనా సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 31 నుంచి వచ్చేనెల 2 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. వచ్చే నెల 2న వెబ్ ఆప్షన్లలో మార్పులకు, వచ్చే నెల 5 న తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కాలేజీల్లో రిపోర్టింగ్ కు వచ్చే నెల 6, 7 తేదీల్లో అవకాశం కల్పించారు.
Next Story






