రూ. 56వేల స్టైఫండ్‌తో ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు..ఇలా అప్లై చేయండి

by Ajay Maddhiboyina |

ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకునేవారికి ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది.

రూ. 56వేల స్టైఫండ్‌తో ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు..ఇలా అప్లై చేయండి
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకునేవారికి ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. టీఈఎస్ 54 కోర్సు ద్వారా ఇండియన్ ఆర్మీలో చేరవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో నాలుగేళ్ల పాటూ ఇంజనీరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వడంతో పాటూ ఆర్మీ శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులో చేరాలనుకనేవారు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివి ఉండాలి. దీంతో పాటూ జేఈఈ మెయిన్స్ రాసి ఉండాలి. కచ్చితంగా పురుష అభ్యర్థులే అయి ఉండాలి.

అభ్యర్థుల వయసు పదహారున్నర సంవత్సరాల నుండి పంతొమ్మిదిన్నర సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అంతే కాకుండా అన్ మ్యారీడ్ అయి ఉండాలి. జూన్ 12వ తేదీ వరకు ఈ స్కీ్ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కోర్సుకు ఎంపికైన వారికి నాలుగేళ్ల పాటూ ఇంజనీరింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటూ ఆర్మీలో టెక్నికల్ ట్రైనింగ్‌లో శిక్షణ ఇస్తారు. డెహ్రాడూన్‌లోని ఐఎంఏ అకాడమీలో వీరికి శిక్షణ ఇస్తారు. కోర్సు సమయంలో నెలకు రూ.56.100 రూపాయల స్టైఫండ్ కూడా అందజేస్తారు. అప్లై చేయానుకునే విద్యార్థులు https://t.co/UIFLTAtMQr లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేసుకుని అప్లై చేయవచ్చు.

Next Story