ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌పీఈసెట్) - 2023

by Disha Web Desk 17 |
ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌పీఈసెట్) - 2023
X

దిశ, ఎడ్యుకేషన్: వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌పీఈసెట్) - 2023 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షను కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

వివరాలు:

తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసీసెట్- 2023)

అర్హతలు: బీపీఈడీ కోర్సుకు బ్యాచిలర్ డిగ్రీతోపాటు జులై 1, 2023 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. డీపీఈడీ కోర్సుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో పాటు జులై 1, 2023 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

టీఎస్‌పీఈసెట్ షెడ్యూల్:

మార్చి 15 నుంచి మే 6: దరఖాస్తుల స్వీకరణ.

మే 7 నుంచి 15 : రూ. 500ల ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు.

మే 26: హాల్ టికెట్లు డౌన్‌లోడ్

జూన్ 1 నుంచి 10 : అభ్యర్థులకు క్రీడల పోటీల నిర్వహణ.

జూన్ 3వ వారం: ఫలితాలు

వెబ్‌సైట్: https://pecet.tsche.ac.in


Next Story

Most Viewed