- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > కెరీర్ > ఎడ్యుకేషన్ > ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్).. మార్చి 13న నోటిఫికేషన్
ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్).. మార్చి 13న నోటిఫికేషన్
by Harish |
రెండేళ్ల బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీఈసెట్) కు నోటిఫికేషన్ విడుదలైంది

X
దిశ, ఎడ్యుకేషన్: రెండేళ్ల బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీఈసెట్) కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పీఈసెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, పీఈసెట్ ఛైర్మన్.. శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశం, కన్వీనర్ రాజేష్‌కుమార్ విడుదల చేశారు.
పీఈసెట్ షెడ్యూల్:
మార్చి 13: నోటిఫికేషన్ విడుదల
మార్చి 15 నుంచి మే 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
మే 7 నుంచి 25 వరకు లేట్ ఫీజుతో దరఖాస్తుకు అవకాశం
మే 26 : హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జూన్ 1 నుంచి 10 వరకు పరీక్షలో భాగంగా అభ్యర్థులకు క్రీడల పోటీలు నిర్వహిస్తారు.
జూన్ 3వ వారం: ఫలితాలు వెల్లడి
వెబ్‌సైట్: https://pecet.tsche.ac.in
Next Story






