రక్షణ రంగంలో సేవలందించాలనుకునే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్

by Bhoopathi Nagaiah |

రక్షణ రంగంలో సేవలందించాలనుకునే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అత్యుత్తమైనవి సైనిక్ స్కూళ్లు (Sainik Schools).

రక్షణ రంగంలో సేవలందించాలనుకునే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : రక్షణ రంగంలో సేవలందించాలనుకునే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అత్యుత్తమైనవి సైనిక్ స్కూళ్లు (Sainik Schools). చదువుతో పాటు రక్షణ రంగంలో ఉద్యోగాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వ్యక్తిగత క్రమ శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ. సైనిక్ స్కూల్‌లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు UPSC నిర్వహించే NDA, CDSE, CAPF మరియు ఇతర రక్షణ రంగ ప్రవేశ పరీక్షల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. డిఫెన్స్ (Defense) రంగాలైన ఆర్మీ(Army), నేవి(Navy), ఎయిర్ ఫోర్స్(Air Force) మొదలగు సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభకనబరుస్తారు. వీటిలో ఆరోతరగతి నుండి ఇంటర్ వరకు చదువుకోవచ్చు. వచ్చే విద్యా సంవత్సరంతో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(All India Sainik School Entrance Examination) AISSEE-2026 ప్రకటన వెలువడింది

AISSEE-2026 నోటిఫికేషన్ వివరాలు

సైనిక్ స్కూల్‌లో ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) (NTA) నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా 33 సైనిక్ స్కూల్ మరియు కొత్తగా గుర్తింపు పొందిన 69 సైనిక్ పాఠశాలలు ఉన్నాయిు. వీటిల్లో ప్రవేశం కోసం పరీక్షను ఎదుర్కోవాలి. భారతదేశంతో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్న రక్షణ రంగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, CAPF కు చెందిన BSF, CRPF, CISF, SSB, ITBP తదితర విభాగాల్లో రెగ్యులర్‌గా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నాయి. UPSC నిర్వహించే NDA & NA అత్యుత్తమమైనవి. ఆర్మీలో గ్రూప్ ఎక్స్ మరియు గ్రూప్ వై. నావీలో సైలర్ - MR,SSR,AA. ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్ మెన్ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగ ప్రకటనలు అన్ని కూడా ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ ఉద్యోగ ప్రకటనలు అన్నీ కూడా ఇంటర్ విద్యార్హతతో జరుగుతున్నాయి. వీటిని సాధించడం కోసం హైస్కూల్ స్థాయి నుండే సరైన శిక్షణ పొందితే ఈ పరీక్షల్లో విజయం సులువు అవుతుంది. అలాంటి సన్నద్ధత సైనిక్ స్కూల్లో లభిస్తుంది. ఈ పరీక్షల్లో సైనిక్ స్కూల్‌లో విద్యనభ్యసించిన విద్యార్థులు ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్నారు. చదువుతో పాటు క్రీడలు, వ్యక్తిగత క్రమశిక్షణ, శారీరక దృఢత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు

ఎంపిక విధానం :

ప్రవేశ పరీక్షలో చూపిన అత్యుత్తమ ప్రతిభ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.

పరీక్ష విధానం:

ఆరవ తరగతిలో ప్రవేశానికి మొత్తం నాలుగు విభాగాల్లో 125 ప్రశ్నలు 300 మార్కులు 2:30 గంటల సమయం

మ్యాథ్స్‌లో : 50 ప్రశ్నలు 150 మార్కులు. ప్రతి ప్రశ్నకి మూడు మార్కులు

ఇంటలిజెన్స్‌లో: 25 ప్రశ్నలు 50 మార్కులు ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు

లాంగ్వేజ్‌లో : 25 ప్రశ్నలు 50 మార్కులు ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు

జనరల్ నాలెడ్జిలో: 25 ప్రశ్నలు 50 మార్కులు ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు

9వ తరగతిలో ప్రవేశానికి: మొత్తం ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలు 400 మార్కులు మూడు గంటల సమయం

మ్యాథ్స్‌లో : 50 ప్రశ్నలు 200 మార్కులు ప్రతి ప్రశ్నకి నాలుగు మార్కులు.

ఇంటలిజెన్స్‌లో: 25 ప్రశ్నలు 50 మార్కులు ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు

లాంగ్వేజ్‌లో : 25 ప్రశ్నలు 50 మార్కులు ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు

జనరల్ సైన్స్‌లో: 25 ప్రశ్నలు 50 మార్కులు ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు

సోషల్ సైన్స్‌లో : 25 ప్రశ్నలు 50 మార్కులు ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు

రుణాత్మక మార్కులు లేవు

మొత్తం సీట్లతో 67% స్థానిక ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. సైనిక్ స్కూల్లో చేరిన విద్యార్థులకు ఏడాదికి బోధన, వసతి మరియు భోజనం మొదలగు అన్ని సదుపాయాలకు కలిపి 1,50,000 వరకు ఫీజు ఉంటుంది. అయితే దీనిలో ప్రతిభ గల విద్యార్థులకు మరియు అల్ప ఆదాయ విద్యార్థులకు ఆయా రాష్ట్రాలు స్కాలర్షిప్పులు మరియు ఫీజు మినహాయింపును ఇస్తున్నాయి.

ఎలా ప్రిపేర్ అవ్వాలి:

ముందుగా (6, 9) తరగతుల నోటిఫికేషనలో ఇచ్చిన సిలబస్ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఎక్కువగా వెయిటేజ్ ఉన్న మ్యాథ్స్ నందు పట్టు సాధించాలి. అలాగే ఇంటలిజెన్స్ జీకే మరియు ఇంగ్లీష్ గ్రామర్ ఆయా తరగతుల స్థాయిలో ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్‌లో నంబర్ సిస్టం ఏరియా అండ్ పెరి మీటర్ ఎలిసిఎం అండ్ హెచ్ సి ఎఫ్ వంటి అధ్యాయాలను ఎక్కువగా చూసుకోవాలి. ప్రాక్టీస్ కోసం ప్రామాణికమైన పబ్లికేషన్ పుస్తకాలు అయినటువంటి హరిహంత్, ఎగ్జామ్ కార్ట్, రేడియన్స్ వంటి ప్రామాణిక పుస్తకాలు తీసుకొని సాధన చేస్తే సులభంగా విజయం సాధించవచ్చు. ముఖ్యంగా గత పరీక్షల పేపర్లను సాధన చేయాలి.

ఎవరు అర్హులు :

ఆరవ తరగతిలో ప్రవేశానికి ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదవ తరగతి చదువుతూ లేదా ఐదవ తరగతి పాస్ అయి ఉండాలి. కానీ 31.03. 2026 నాటికి వయస్సు 10 నుండి 12 సంవత్సరాలలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 1st 2014 నుండి మార్చి 31st 2016 మధ్య జన్మించిన వారై ఉండాలి. తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి ఎనిమిదో తరగతి చదువుతూ లేదా పాస్ అయి ఉండాలి వయసు మార్చి 31st 2026 నాటికి 13 నుండి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ ఫస్ట్ 2011 నుండి మార్చి 31st 2013 మధ్య జన్మించిన వారై ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు 10th October 2025 to 30th October 2025 సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు.

కావలసిన సర్టిఫికెట్స్

1. ఇమెయిల్ ఐడి

2. మొబైల్ నెంబర్

3. కాండేట్ ఫొటో, సిగ్నేచర్

4. కాండేట్ లెఫ్ట్ హ్యాండ్ తంబు ఇంప్రెషన్

5. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్

6. రెసిడెన్స్ సర్టిఫికెట్

7. క్యాస్ట్ సర్టిఫికెట్

పరీక్ష ఫీజు OC/OBC వాళ్లకు ₹850, SC/ST వాళ్లకు ₹700

పరీక్ష తేదీ: జనవరి 2026లో..

ఫలితాలు: పరీక్ష జరిగిన నాలుగు నుండి ఆరు వారాల్లోపు ఫలితాలు విడుదల చేస్తారు

పరీక్ష కేంద్రాలు : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో

వెబ్సైట్ : https://exams.nta.nic.in/sainik-school-society, https://nta.ac.in

Next Story