- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking:నీట్ పీజీ పరీక్ష వాయిదా.. కారణం ఇదే!
నీట్ పీజీ ప్రవేశ పరీక్షను దేశంలో వైద్య విద్యలో MD, MS, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: నీట్ పీజీ ప్రవేశ పరీక్షను దేశంలో వైద్య విద్యలో MD, MS, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీ చేస్తారు. ఈ పరీక్షను NBE నిర్వహిస్తుంది. నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ర్యాంకులు, సీట్లు కేటాయించబడతాయి. ఈ క్రమంలో నీట్ పీజీ–2025 పరీక్షను ఈ నెల(జూన్) 15న నిర్వహించి, వచ్చే నెల(జులై) 15న ఫలితాలు ప్రకటించాలని ఎన్‌బీఈ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కానీ.. నీట్ పీజీ ఎంట్రన్స్ పై తాజాగా ఎన్‌బీఈ కీలక అప్డేట్ ఇచ్చింది. నీటి పీజీ-2025 ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 15వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు NBE తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. రీసెంట్‌గా నీట్ పీజీ పరీక్షను పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని బోర్డుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు కోసం వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తెలిపింది.






