- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేట్ విద్యకు దూరమవుతోన్న విద్యార్థులకు సువర్ణావకాశం.. ఈ నోటిఫికేషన్ మీ కోసమే..
ప్రతిభ ఉన్నా ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ విద్యకు దూరమవుతోన్న ఎస్సీ విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతిభ ఉన్నా ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ విద్యకు దూరమవుతోన్న ఎస్సీ విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం. కేంద్ర సామాజిక న్యాయం-సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ (National Entrance Test for Excellence) (SHRESHTA) (NETS) 2024 ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు సీబీఎస్ఈ (CBSE) అనుబంధ ప్రముఖ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం ద్వారా వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి చేయూతనందించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ శ్రేష్ఠ విద్యా పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 3వేల సీట్లను భర్తీ చేయనున్నారు.
అర్హతలు: 2024-25 విద్యా సంవత్సరంలో ఎనిమిది, పదో తరగతి చదువుతోన్న విద్యార్థులు ఈ ఎంట్రన్స్ పరీక్షకు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించరాదు.
దరఖాస్తులు: 10th October 2025 నుంచి 30th October సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు లేదు నవంబర్ 1 నుంచి 2వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం. డిసెంబర్ -2025లో పరీక్ష నిర్వహిస్తారు. ఆఫ్లైన్ పరీక్ష (పెన్ను, పేపర్ విధానం) ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 గంటల పాటు ఉంటుంది. నవంబర్‌లో అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు పరీక్ష జరిగిన నాలుగు లేదా ఆరు వారాల్లో ప్రకటిస్తారు.
రాతపరీక్ష విధానం: ఈ పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్, సైన్సు, సోషల్సైన్స్, జనరల్ అవేర్నెస్/నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసే విద్యార్థులు.. ఎన్సీఈఆర్టీ సిలబస్‌లో ఎనిమిదో తరగతి సిలబస్ చదవాలి. 11వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసే విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పదో తరగతి సిలబస్ చదవాలి.
వెబ్‌సైట్ : https://exams.nta.nic.in/shreshta/, https://www.nta.ac.in/
- Tags
- National Entrance Test for Shrestha
- Shrestha Entrance Exam 2025
- NETS
- Notification
- Shrestha Schools Admission
- Shrestha Entrance Test 2025. National Entrance Test for Shrestha Notification
- National Entrance Test for Excellence
- NETS 2025 Online Application
- NETS 2025 Registration
- Shrestha School Admission Form
- NETS Exam Date 2025
- NETS Eligibility Criteria
- NETS Syllabus and Exam Pattern
- NETS Admit Card 2025
- NETS Result Date






