- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NMMS పరీక్ష-2025 స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం.. రేపే చివరి తేదీ
స్కాలర్‌షిప్ కార్యక్రమం భారతదేశంలో సెకండరీ స్థాయిలో విద్యను అభ్యసిస్తున్న అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది NMMS

దిశ, వెబ్‌డెస్క్ : నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్ష 07-12-2025. ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమం భారతదేశంలో సెకండరీ స్థాయిలో విద్యను అభ్యసిస్తున్న అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. NMMS పరీక్ష 2025 గురించి పూర్తి సమాచారం కోసం మీ కోసం..
భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ పథకాన్ని (N.M.M.S.S) ప్రారంభించింది. ఈ పథకం కింద నివాస సౌకర్యం లేని ప్రభుత్వ/స్థానిక సంస్థలు/మునిసిపల్/ఎయిడెడ్ పాఠశాలలు/మోడల్ పాఠశాలల్లో (అంటే నివాసేతర పాఠశాలల నుండి మాత్రమే) 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు. పాఠశాలలో ఎంపిక చేయబడిన విద్యార్థులకు సంవత్సరానికి రూ.12000 స్కాలర్‌షిప్ వస్తుంది. ఇది పొందడానికి ఆన్‌లైన్ క్లియరింగ్ సిస్టమ్ ఉన్న ఏదైనా జాతీయం చేసిన బ్యాంకులో ఖాతాలను తెరవాలి. నిర్ణీత సమయంలోగా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో తమ ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసుకుని అప్‌లోడ్ చేయాలి.
ఎవరు అర్హులు: ప్రస్తుతం (2025-26): 8వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు మరియు పరీక్ష రుసుము చెల్లించడానికి నమోదు తేదీలు:
04-09-2025 నుండి 18-10-2025 వరకు
పరీక్ష తేదీ : 07-12-2025
వెబ్‌సైట్ : http://bse.telangana.gov.in
అర్హత: 7వ తరగతిలో OC/BC అభ్యర్థుల విషయంలో కనీసం 55% మార్కులు మరియు SC/ST అభ్యర్థుల విషయంలో 50% మార్కులు పొందిన మరియు పైన పేర్కొన్న పాఠశాలల నుండి VIII తరగతి చదువుతున్న అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ. 3,50,000/- మించకూడదు.
ZP/స్థానిక సంస్థ/ప్రభుత్వ/ప్రభుత్వ సహాయంతో పనిచేసే పాఠశాలల్లో చదువుతున్నవారు నివాస సౌకర్యం లేని మోడల్ పాఠశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. నివాస సౌకర్యం ఉన్న మోడల్ పాఠశాలల అభ్యర్థులు NMMSE దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. ఈ విషయంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలి. అభ్యర్థి యొక్క ఒరిజినల్ 7వ తరగతి పాస్ మార్కుల మెమోను సమర్పించాలి.
తెలంగాణ రెసిడెన్షియల్ హైస్కూల్స్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హైస్కూల్స్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ ఆశ్రమ హైస్కూల్స్ మరియు కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ సౌకర్యం ఉన్న మోడల్ స్కూల్స్, జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్ సహా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మరియు రెసిడెన్షియల్ సౌకర్యం ఉన్న ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు కాదు.
పరీక్ష ఫీజు:
ఓసీ / బీసీ కుల విద్యార్థులకు: రూ.100
Sc, st & పిహెచ్ విద్యార్థులకు: రూ. 50
పరీక్ష రుసుమును SBI bank ద్వారా చెల్లించాలి.
పరీక్షా విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది: మానసిక సామర్థ్య పరీక్ష(మెంటల్ ఎబిలిటీ టెస్ట్)
(M.A.T) - 90 మార్కుల బహుళైచ్ఛిక ప్రశ్నలు.
స్కాలస్టిక్ ఎబిలిటీ టెస్ట్. (S.A.T) - 90 మార్కులు
7వ & 8వ తరగతుల శాస్త్రాలు, గణితం మరియు సాంఘిక శాస్త్రాలను కవర్ చేస్తుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఒక ప్రశ్నకు సమయం ఒక నిమిషం.
కనీస అర్హత శాతం
ప్రతి పేపర్‌కు 40% మార్కులు ఉంటాయి మరియు SC/ST విద్యార్థుల విషయంలో ఈ కట్ ఆఫ్ 32% ఉంటుంది.
MHRD న్యూఢిల్లీ జారీ చేసిన నిబంధనల ప్రకారం జిల్లా వారీగా మరియు కమ్యూనిటీ వారీగా కేటాయించిన కోటాకు లోబడి మెరిట్ ప్రకారం ఎంపిక చేయబడుతుంది.
పరీక్షలో ఎలా విజేతగా ఎలా నిలవాలి
పాత పరీక్ష పత్రాలను ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆయా మోడల్ ప్రశ్నలను సులభంగా గుర్తించి విజయం సాధించవచ్చు.






