- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP EAPCET ఫలితాలపై కీలక అప్‌డేట్
ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో AP EAPCET రిజల్ట్స్‌ను రిలీజ్ చేయడానికి ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మే 19 నుంచి 27 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే.. ఈ ఫలితాలను మొదటగా ఈ నెల(జూన్) 14వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. ఇవాళ(ఆదివారం) సాయంత్రం 5.30గంటలకు విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు తాజాగా వెల్లడించారు. జేఎన్‌టీయూకే బీసీ కాన్ఫరెన్స్ హాలులో ఈ ఫలితాలను సెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి సీఎస్ఆర్‌కే ప్రసాద్ విడుదల చేస్తారని తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ను https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
సందర్శించండి. కాగా ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 3.40లక్షల మంది పరీక్షలు రాశారు.






