జేఈఈ మెయిన్స్ 2026 షెడ్యూల్ విడుదల

by Ajay Maddhiboyina |

జేఈఈ మెయిన్స్ 2026 షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: జేఈఈ మెయిన్స్-2026 ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. జ‌న‌వ‌రి 21 నుండి 30 వ‌ర‌కు జేఈఈ మెయిన్స్-1 ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల నుండి మెయిన్స్-1కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించనున్నారు. ఏప్రిల్ 1 నుండి 10 వ‌ర‌కు జేఈఈ మెయిన్స్ 2 ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. మెయిన్స్-2కు జ‌న‌వ‌రి చివ‌రి వారం నుండి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. కొద్ది రోజులుగా ప‌రీక్ష కేంద్రం ఎంచుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ విద్యార్థులు న‌చ్చిన ప‌రీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవ‌చ్చ‌ని నోటిఫికేష‌న్ లో పేర్కొన్నారు. ఆన్ లైన్ అప్లికేష‌న్ లో ఏమైనా త‌ప్పులు ఉంటే స‌వ‌రించేందుకు విద్యార్థులు ముందుగానే త‌మ ఆధార్ కార్డుల‌ను త‌ప్పులు లేకుండా అప్డేట్ చేసుకోవాల‌ని సూచించారు. షెడ్యూల్ పూర్తి వివ‌రాల కోసం jeemain.nta.nic.in వెబ్ సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.

Next Story