TES:ఇంటర్ పాస్ అయ్యారా.. ఇండియన్ ఆర్మీలో జాబ్ ఆఫర్స్!

by Jakkula.Mamatha |

ఇంటర్మీడియట్ పాసై ఆర్మీలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి సువర్ణావకాశం.

TES:ఇంటర్ పాస్ అయ్యారా.. ఇండియన్ ఆర్మీలో జాబ్ ఆఫర్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్ పాసై ఆర్మీలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి సువర్ణావకాశం. ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(TES) కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి ఇంటర్‌లో MPC పూర్తి చేసి, JEEమెయిన్స్(2025)కు అప్లై చేసిన వారు అర్హులు గా ప్రకటించారు. అంటే.. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఇంటర్ లేదా దానికి సమానమైన పరీక్షతో జేఈఈ (మెయిన్స్) 2025 లో ఉత్తీర్ణులైన ఉండాలి.

ఇందులో 90 ఖాళీలు ఉన్నాయి. వయసు 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. JEE (మెయిన్స్) స్కోరు, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నాలుగేళ్ల కోర్సు తర్వాత ఆర్మీలో పర్మినెంట్ చేస్తారు. శిక్షణ కాలంలో నెలకు రూ.56,100స్టైఫండ్ ఇస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల(జూన్) 12వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.joinindianarmy.nic.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Next Story