Alert:ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-19 09:15:55  IST  )

బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సువర్ణవాకాశం.

Alert:ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ!
X

దిశ,వెబ్‌డెస్క్: బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సువర్ణవాకాశం. ఈ నెల(మే) 8వ తేదీన IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి IDBI దరఖాస్తులు స్వీకరిస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు రేపటి వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తుల గడువుకు చివరి తేదీ ఈ నెల(మే) 20వ తేదీ అని నోటిఫికేషన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులుగా పేర్కొంది.

అభ్యర్థుల వయస్సు మే 1, 2025 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల వారీగా సడలింపు ఉంది. ఆబ్జెక్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.6.14 లక్షల-రూ.6.50 లక్షల జీతం, DA, HRA, అలవెన్స్‌లు లభిస్తాయి. ఈ పరీక్ష వచ్చే నెల(జూన్) 8వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ క్రమంలో అభ్యర్థులు రేపటితో గడువు ముగుస్తున్నందున త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx ను సందర్శించండి.

Next Story