నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫారెస్ట్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

by Jakkula.Mamatha |

నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న, అర్హత ఆసక్తిగల అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫారెస్ట్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ,వెబ్‌డెస్క్: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న, అర్హత ఆసక్తిగల అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సుమారు 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇంజనీరింగ్, సైన్స్ గ్రూపులు(BZC, ఫిజిక్స్, మ్యాథ్స్ మొదలైనవి) గ్రాడ్యుయేట్లు ఫిబ్రవరి 24, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు, OBC 3 సంవత్సరాల సడలింపు, PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ , ఇంటర్వ్యూ ఉంటాయి. జనరల్ / ఓబీసీ / ఇడబ్ల్యుఎస్‌ రూ. 100/-, SC / ST / PwBD / మహిళలకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులు UPSC వెబ్‌సైట్ https://www.upsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఈ నెల(ఫిబ్రవరి) 24గా ప్రకటించారు. అభ్యర్థులకు పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Next Story