Government:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-03 14:48:35  IST  )

రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Government:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఏపీ ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన, ప్రభుత్వ P4 కార్యక్రమాల సమన్వయం కోసం ఈ నియామకాలు చేపట్టనున్నారు.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న 175 యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాలు ఏడాది కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటాయి. అభ్యర్థుల పనితీరు, అవసరాల ఆధారంగా ఈ కాంట్రాక్టు కాలాన్ని భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పనిచేయాల్సి ఉంటుంది.

అర్హతలు: MBA/పీజీ డిగ్రీ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ఉండాలి. కనీసం సంబంధిత విభాగంలో 4 సం.లు అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.60,000

ఎంపిక విధానం: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

వయోపరిమితి: 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థి వయసు 40 ఏళ్లు మించకూడదని పేర్కొన్నారు.

దరఖాస్తు విధానం, గడువు: ఆన్‌లైన్‌లో వెబ్ సైట్ ద్వారా https://apsdpscareers.com/YP.aspxఈనెల 13వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Next Story