- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగ యువతకు శుభవార్త వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: నిరుద్యోగ యువతకు శుభవార్త వచ్చింది. బ్యాంకు ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 50 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి.
ఈ క్రమంలో నోటిఫికేషన్‌లో పోస్టుల ఖాళీల విషయానికొస్తే.. 21 వేల మంది ఆఫీసర్ విభాగంలో కాగా, మిగిలినవి క్లర్కులు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ నియామకాల్లో కేవలం SBI ఒక్కటే 20 వేల మందిని నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 4 వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది. ఇక, మిగతా బ్యాంకుల ఉద్యోగ నియామకాల వివరాలు తెలియాల్సి ఉంది. 2025 మార్చి నాటికి ఈ బ్యాంకుల్లో 2,36,226 మంది పని చేస్తున్నారు. ఇందులో 1,15,066 మంది ఆఫీసర్లుగా ఉన్నట్లు సమాచారం.






