- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ జీతంతో ఉద్యోగాలు
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. కేంద్ర కేబినేట్ సెక్రటేరియట్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 250(డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్) గ్రూప్-B పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
అలాగే, గేట్ 2023/2024/2025 స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 30 ఏళ్లు మించరాదు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ దరఖాస్తులను పోస్ట్ ద్వారా లోధీ రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ చిరునామాకు పంపించాలి. జీతం రూ.99,000 వరకు ఉంటుంది. పూర్తి స్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ http://cabsec.gov.in/ ను సందర్శించండి.






