నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల

by Jakkula.Mamatha |

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. రైల్వేలో లక్షకు పైగా ఉద్యోగాల భర్తీకి తాజాగా రైల్వే డిపార్ట్‌మెంట్ అధికారికంగా 2026-27 రైల్వే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్, సెక్షన్ కంట్రోలర్, జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ క్యాటగిరీస్, రైల్వే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి(NTPC), మినిస్టీరియల్&ఐసోలేటెడ్ కేటగిరి, గ్రూప్-D లెవెల్ వన్ నోటిఫికేషన్లను 2026-27 సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు రైల్వే డిపార్ట్మెంట్ అధికారింగా పేర్కొంది.

ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్(ALP) నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మార్చిలో టెక్నీషియన్. ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ. ఆగస్టులో NTPC , సెప్టెంబరులో మినిస్ట్రీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు. అక్టోబర్‌లో గ్రూప్-D నియామాకాలు ఉండనున్నాయి.

ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా రైల్వే డిపార్ట్మెంట్ వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.

Next Story