భారీ జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లికేషన్‌కు డైరెక్ట్ లింక్ ఇదే!

by Jakkula Mamatha |
భారీ జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లికేషన్‌కు డైరెక్ట్ లింక్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు IPPB గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(India Post Payment Bank) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐపీపీబీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ 51 పోస్టుల రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నెల 21వ తేదీన అప్లికేషన్‌కు చివరి తేదీ. అప్లై చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/ను సందర్శించండి. అయితే ఈ జాబ్స్‌కి రాతపరీక్షఉండదు. డిగ్రీ మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితా ఎంపిక చేస్తారు. ఆపై ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పోస్టులను ప్రారంభంలో ఒక ఏడాది కాంట్రాక్ట్ వ్యవధితో భర్తీ చేస్తారు. ఆ తర్వాత సంతృప్తికరమైన పనితీరుపై ఆధారపడి.. మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంటుంది. గరిష్ట కాంట్రాక్ట్ వ్యవధి 3 సంవత్సరాలు.

అర్హతలు:

మొత్తం పోస్టులు: 51

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.30,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీ: ఎస్సీ, ఎస్టీ, వికలాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.150, జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Next Story

Most Viewed