- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవోదయ ప్రవేశాలకు మరోసారి గడువు పొడగింపు.. ఇదే లాస్ట్ చాన్స్..
నవోదయలో 2025-26 సంవత్సరంలో ఇంటర్ & 9 వ తరగతిలో ప్రవేశాల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

దిశ, వెబ్‌డెస్క్ : నవోదయలో 2025-26 సంవత్సరంలో ఇంటర్ & 9 వ తరగతిలో ప్రవేశాల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఇంటర్మీడియట్( New అడ్మిషన్ ) & 9వ, తరగతిలో మిగిలిన సీట్ల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, గడువు పెంచడం ఇదే చివరి అవకాశంగా పేర్కొంది. అయితే ఈ ప్రవేశాలకు ఎవరు అర్హులు, దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి, చివరి తేదీ ఎప్పుడో చూద్దాం.
లాస్ట్ డేట్ : 21-10-2025
కావాల్సిన సర్టిఫికెట్స్ :
1.ఏ class అయినా Bonafide,
2.ఆధార్ కార్డ్
3.ఫోటో,
4.సంతకం
5.మెయిల్ ఐడీ
6.ఫోన్ నంబర్
అర్హత : ప్రస్తుతం 2024-25 లో 9వ, తరగతికి 8వ, తరగతి, ఇంటర్‌కి 10వ, తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి వయస్సు 1st may 2011 to 31st July 2013 మధ్య జన్మించి ఉండాలి. రూరల్‌లో చదివిన విద్యార్థులకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఒక్కరోజు అర్బన్‌లో చదివినా వారు ఓపెన్ కేటగిరీ కిందికి వస్తారు.
పరీక్ష విధానం:
మొత్తం నాలుగు కేటగిరిలో 100 ప్రశ్నలకు వంద మార్కులు రెండున్నర గంటల సమయం
1. ఇంగ్లీష్ : 15 ప్రశ్నలు 15 మార్కులు
2. హిందీ : 15 ప్రశ్నలు 15 మార్కులు
3. Mathematics: 35 ప్రశ్నలు 35 మార్కులు
4. జనరల్ సైన్స్ : 35 ప్రశ్నలు 35 మార్కులు
ఎగ్జామ్ డేట్: 07-02-2026
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా
వెబ్ సైట్: https://cbseitms.nic.in/2025/nvsix_9/?AspxAutoDetectCookieSupport=1






