CUET UG 2026: పరీక్షల కొత్త షెడ్యూల్, అడ్మిట్ కార్డ్స్ విడుదల

by Ramesh Naini |

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG 2026) సవరించిన పరీక్షా తేదీలను, అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది.

CUET UG 2026: పరీక్షల కొత్త షెడ్యూల్, అడ్మిట్ కార్డ్స్ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG 2026) సవరించిన పరీక్షా తేదీలను, అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. వాస్తవానికి మే 28న జరగాల్సిన ఈ పరీక్షలు, ఈద్-ఉల్-అజా (బక్రీద్) పండుగ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ ప్రకారం, వాయిదా పడిన పరీక్షలను మే 31, జూన్ 6, జూన్ 7 తేదీల్లో నిర్వహించనున్నారు.

సెంట్రల్, స్టేట్ ప్రైవేట్ వర్సిటీల్లో ప్రవేశాలు

మే 31న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్ కార్డ్‌లను NTA ఇప్పటికే విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6, 7 తేదీల్లో పరీక్షలు రాయబోయే అభ్యర్థుల అడ్మిట్ కార్డులను త్వరలోనే విడుదల చేస్తామని తాజా ప్రకటనలో NTA డైరెక్టర్ డాక్టర్ అర్చన శుక్లా తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం, అప్‌డేట్స్ కోసం నిరంతరం cuet.nta.nic.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని అధికారులు సూచించారు. కాగా, దేశంలోని సెంట్రల్, స్టేట్ ఎంపిక చేసిన ప్రైవేట్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా 2022 నుంచి ఈ CUET UG పరీక్షలను నిర్వహిస్తున్నారు.

Next Story