CSIR UGC NET ఎగ్జామినేషన్ జూన్ 2023

by Disha Web Desk 17 |
CSIR UGC NET ఎగ్జామినేషన్ జూన్ 2023
X

దిశ, ఎడ్యుకేషన్: సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే ..సీఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2022/జూన్ 2023కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. సైన్స్ సబ్జెక్టుల్లో రిసెర్చ్‌కు అవకాశం కల్సించే జేఆర్ఎఫ్ తోపాటు లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షను నిర్వహిస్తారు.

వివరాలు:

జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2022/జూన్ 2023.

సబ్జెక్టులు: 5 సబ్జెక్టులకు ఈ పరీక్ష ఉంటుంది.

1. కెమికల్ సైన్సెస్

2. ఎర్త్, అట్మాస్మియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్

3. లైఫ్ సైన్సెస్

4. మ్యాథమెటికల్ సైన్స్

5. ఫిజికల్ సైన్సెస్

అర్హత: 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ /నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్ఎంఎస్/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజర్వేషన్ ఉన్న వారు నిబంధనల ప్రకారం 50 శాతం మార్కులు సాధించాలి.

వయసు: జేఆర్ఎఫ్‌కు జనరల్ అభ్యర్థులకు జులై 1, 2022 నాటికి 28 ఏళ్లు మించరాదు. (నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి). ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ /లెక్చరర్‌షిప్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 10, 2023.

పరీక్ష తేదీలు: జూన్ 6,7,8/2023.

వెబ్‌సైట్: https://csirnet.nta.nic.in


Next Story