- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CUET UG 2026: నేడే దరఖాస్తుకు చివరి గడువు.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 రిజిస్ట్రేషన్ కు నేటితో గడువు ముగియనుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఉన్న ప్రముఖ, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG 2026) రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కోరింది. నేటి అర్ధరాత్రి 11.50 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ లింక్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ cuet.nta.nic.in ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపింది.
వెబ్ సైట్ ఓపెన్ చేశాక 'CUET UG 2026 Registration' లింక్ పై క్లిక్ చేయాలి.
కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి.
ఆ తర్వాత రిజిస్టర్డ్ వివరాలతో లాగిన్ అవ్వాలి.
అక్కడ కనిపించే అప్లికేషన్ ఫారమ్ ను నింపి దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
ఫారమ్ ను సబ్మిట్ చేసి.. భవిష్యత్ అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
ఆఖరి నిమిషంలో సాంకేతిక సమస్యలు లేకుండా ఉండేందుకు అభ్యర్థులు గడువు ముగిసేలోపు ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలని NTA సూచించింది.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు మే 11వ తేదీ నుంచి 31 వరకూ జరగనున్నాయి. 37 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం NTA ఏర్పాట్లు చేస్తోంది.






