- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే మీ లక్ష్యమా.. బిల్ గేట్స్ కీలక సూచనలివే
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాలని చాలా మందికి ఉంటుంది. అధిక జీతాలు, లగ్జరీ ఉంటుందని ఈ ఉద్యోగంలో చేరడానికి ఎంతో ఆసక్తిచూపిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాలని చాలా మందికి ఉంటుంది. అధిక జీతాలు, లగ్జరీ ఉంటుందని ఈ ఉద్యోగంలో చేరడానికి ఎంతో ఆసక్తిచూపిస్తున్నారు. అయితే చాలా మందికి సరైన స్కిల్స్ లేకపోవడం, ఇంటర్వ్యూల్లో తడబడటంతో ఉద్యోగం సాధించలేకపోతున్నారు. అలాంటి వారికోసం టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కొన్ని సూచనలు ఇచ్చారు. ఇంటర్వ్యూలో అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఎలా ఇవ్వాలో చెప్పారు.
మిమ్మల్నే ఎందకు ఉద్యోగానికి ఎంపిక చేయాలి అనే ప్రశ్నకు..కాలేజీలో నేర్చుకున్న దానికంటే ఎక్కువ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్‌లు రాయగలనని చెప్పాలన్నారు. కాన్ఫిడెంట్గా కోడింగ్ చేయగలనని చెప్పాలని తెలిపారు. టీమ్ వర్క్ ఇష్డపడతానని, కొత్తవారితో సులువుగా కలిసిపోతానని చెప్పాలని సూచించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే ఇష్టమని, ఎంత బెటర్ అయ్యాననే విషయాన్ని పనిచూసి తెలుసుకోవాలని సూచించారు.
అదే విధంగా బలాలు బలహీనతల గురించి అడితే తెలియదు అని నిజాయితీగా చెప్పాలన్నారు. మీరు ఎలాంటి ఉద్యోగాన్ని సమర్థవంతంగా చేస్తారు, మీరు ఇష్టంగా చేసే ఉద్యోగం ఏంటి అనే విషయాలను నేరుగా చెప్పాలన్నారు. జీతం గురించి అడిగితే అంతే డబ్బుల కంటే స్టాక్స్ ఆప్షన్స్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నారు. ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటా కాబట్టి జతంలో భాగంగా స్టాక్స్ ఇవ్వాలని అడగాలని సూచించారు. ఆలోచించకుండా మీరు ఎంత అడగాలని అనుకుంటున్నారో అంత అడగాలని చెప్పారు.






