- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ అలర్ట్.. ఆ పరీక్షల షెడ్యూల్ రిలీజ్!
రాష్ట్రంలో నిర్వహించబోతున్న పలు సెట్స్‌కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిర్వహించబోతున్న పలు సెట్స్‌కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET) - 2025 షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షను మే 6వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
సెట్స్‌కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్..
*మే 6వ తేదీన AP ECET పరీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మొదటి షిఫ్ట్ 9.00 గంటల నుంచి 12.00 గంటల వరకు, రెండవ షిఫ్ట్ 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేస్తే https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspxహాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
*మే 7న AP ICET మొదటి షిఫ్ట్ 9.00 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండవ షిఫ్ట్ 2.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
*మే 21, 24, 26, 27 తేదీల్లో AP EAPCET (Eng)పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ 9.00 గంటల నుంచి 12.00 గంటల వరకు, రెండవ షిఫ్ట్ 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.
*జూన్ 5వ తేదీన AP LAWCET/PGLCET ఉదయం 9.00 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
*జూన్ 5వ తేదీన APEd.CET 2.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహిస్తారు.
*AP PGECET జూన్ 6వ, 8వ తేదీల్లో మొదటి షిఫ్ట్ 9.00 గంటల నుంచి 11 గంటల వరకు, రెండో షిఫ్ట్ సాయంత్రం 2.00 గంటల నుంచి 4.00 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి కీలక సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రంలోకి అనుమతించరని తెలిపింది. విద్యార్థులు గంటన్నర ముందుగానే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష హాలులోకి క్యాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని తెలిపారు.






