- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UGC NET 2024:నెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మరోసారి వాయిదా పడిన పరీక్ష
యూజీసీ నెట్ 2024 ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక అప్‌డేట్ ఇచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్:యూజీసీ నెట్ 2024 ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల (ఆగస్టు) 26న జరగాల్సిన పరీక్షను మరుసటి రోజు 27కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 26వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను రీషెడ్యూల్ చేసినట్టు వివరించింది. ఈ క్రమంలో రీ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచింది. కాగా యూజీసీ నెట్ పరీక్షలు ఆగస్టు 21 ప్రారంభమై సెప్టెంబర్ 4 వరకు కొనసాగనున్నాయి. ఆగస్టు నెలలో 21, 22, 23, 27 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు, షెడ్యూల్‌కు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 011-40759000 లేదా [email protected] ఈ-మెయిల్‌ను అభ్యర్థులు సంప్రదించవచ్చునని సూచించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in ను సందర్శించండి.






