- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UGC NET-2025(December): అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాలు ఎప్పుడంటే?
ఎన్టీయే ఆధ్వర్యంలో ప్రతి ఏటా యూజీసీ నెట్ పరీక్షలను రెండు సార్లు నిర్వహిస్తుంటారు. జూనియర్ ఫెలోషిప్ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఎన్టీయే ఆధ్వర్యంలో ప్రతి ఏటా యూజీసీ నెట్ పరీక్షలను రెండు సార్లు నిర్వహిస్తుంటారు. జూనియర్ ఫెలోషిప్ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో మొత్తం 85 సబ్జెక్టులకు గానూ గత ఏడాది(2025) డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి(2026) 7వ తేదీ వరకు CBT(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) విధానంలో యూజీసీ నెట్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ తరుణంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డిసెంబర్ 2025కు సంబంధించిన UGC-NET ఆన్సర్ కీని ఈ నెల(జనవరి) 15వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో యూజీసీ నెట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
UGC-NET ఫలితాలు ఎప్పుడు?
UGC-NET డిసెంబర్ 2025 ఫలితం కోసం అధికారిక తేదీని NTA ఇంకా ప్రకటించలేదు. అయితే, తాత్కాలిక సమాధానం కీ విడుదలై అభ్యంతరాలు తెలిపే సమయం కూడా జనవరి 17వ తేదీన ముగిసింది. తుది సమాధానం కీ కోసం సన్నాహాలు, ఫలితాన్ని ప్రచురించడం తదుపరి దశ. ఇక, పరీక్షకు హాజరైన అభ్యర్థులు తుది ఫలితం కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే.. తుది ఫలితాన్ని ఈ నెల(జనవరి) చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులకు కచ్చితమైన తేదీని UGC NET యొక్క అధికారిక https://ugcnet.nta.ac.in/ వెబ్‌సైట్‌లో ప్రచురించబడుతుంది.






