Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకు 4 రోజులే గడువు

by Vennela |

Bank Of Baroda: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక్కటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda)నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1267 స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 17వ తేదీతో ముగుస్తుంది.

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకు 4 రోజులే గడువు
X

Bank Of Baroda: నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda). ఈ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల(Notification for Specialist Officer jobs) భర్తీకి నోటిఫికేషన్ గత నెలలో విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1267 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు https://www.bankofbaroda.in/ బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1267 మేనేజర్లను నియమించనుంది. ఇతర పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

కాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైంది. జనవరి 17, 2025న ముగియనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda)భర్తీ చేసే ఉద్యోగాల్లో అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు 150, అగ్రికల్చరల్ మార్కెటింగ్ మేనేజర్ 50, మేనేజర్ సేల్స్ 450 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అర్హతలు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హత, వయస్సు ను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. https://www.bankofbaroda.in/

ఎంపిక ప్రక్రియ

ఈ పోస్టులకు ఆన్ లైన్ టెస్టు, సైకోమెట్రిక్ టెస్టు లేదా తదుపరి ఎంపిక ప్రక్రియకు అనువైన ఇతర పరీక్ష, తర్వాత గ్రూప్ డిస్కషన్, లేదా అభ్యర్థుల ఇంటర్వ్యూ, ఆన్ లైన్ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా ఎంపిక చేపడతారు. ఆన్ లైన్ పరీక్షలో 150 ప్రశ్నలు, మొత్తం మార్కులు 225 ఉంటాయి. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహా ఆన్ లైన్ పరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ఫీజు

దరఖాస్తు ఫీజు జనరల్, EWS, OBC కేటగిరీ అభ్యర్థులు రూ. 600తోపాటు ఇతర పన్నులు కూడా వర్తిస్తాయి. నిర్ణీత పేమెంట్ గేట్ వే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 100చెల్లించాలి. ఆన్ లైన్ పరీక్ష నిర్వహించినా, నిర్వహించకపోయినా ఇంటర్వ్యూకు అభ్యర్థి షార్ట్ లిస్ట్ అయినా కాకున్నా అభ్యర్థి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు, ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Next Story