ఆర్ట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. చివరితేదీ ఎప్పుడంటే..?

by Disha Web Desk 13 |
ఆర్ట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. చివరితేదీ ఎప్పుడంటే..?
X

దిశ, కెరీర్: తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన132 ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ - రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు - 16

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాలు - 6

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాలు - 72

తెలంగాణ మైనార్టీ సంక్షమే గురుకులాలు - 38

వేతనం: నెలకు రూ. 31,040 నుంచి రూ. 92,050

అర్హతలు: పదో తరగతి, డిప్లొమా, టీసీసీ, బీఎఫ్ఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జులై 1, 2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 1200 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్; దివ్యాంగులకు రూ. 600 చెల్లించాలి).

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 24, 2023

చివరితేదీ: మే 24, 2023.

వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in


ఇవి కూడా చదవండి:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గురుకుల పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Next Story

Most Viewed