- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG EAPCET-2025 ఫలితాల్లో ఏపీ విద్యార్థుల సత్తా
తెలంగాణ EAPCET ఫలితాలు ఈరోజు(ఆదివారం) విడుదలైన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ EAPCET ఫలితాలు ఈరోజు(ఆదివారం) విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని వివిధ యూనివర్శిటీలు, ప్రైవేటు కళాశాలల్లో BE, B Tech, B Pharm, pharm D, Bsc(Hons) Agriculture, BFSc, BVSc వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందనున్నారు.
ఈ ఫలితాల్లో భాగంగా ఇంజనీరింగ్ విభాగంలో మొదటి పది ర్యాంకులు బాలురు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్‌లో తొలి మూడు అత్యున్నత స్థానాలను ఏపీ(Andhra Pradesh)కి చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్‌చంద్ర ప్రథమ ర్యాంక్ సాధించాడు. ఇక నంద్యాల జిల్లా కోనాపురం నివాసి ఉడగండ్ల రామ్‌చరణ్‌రెడ్డి ద్వితీయ ర్యాంక్, విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తీక్ తృతీయ ర్యాంకును కైవసం చేసుకున్నారని అధికారులు తెలిపారు.






