- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు అలర్ట్.. పాలిసెట్ కౌన్సెలింగ్ ఎప్పటి నుంచంటే?
ఏపీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిసెట్-2025 ప్రవేశాలకు ఇటీవల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిసెట్-2025 ప్రవేశాలకు ఇటీవల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం జరుగుతుండటంతో వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల(జూన్) 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ నెల 30కి వాయిదా వేశారు.
కాగా, గత ఏప్రిల్ 30న పాలిసెట్ పరీక్ష నిర్వహించగా.. మే 14న ఫలితాలు విడుదల చేశారు. 1,39,840 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరు కాగా.. 1,33,358 మంది అర్హత సాధించారు. ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు https://polycet.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రూ.250 చెల్లించాలి. ఇతర సందేహాలకు మెయిల్ ఐడీ [email protected] లేదా హెల్ప్ లైన్ నెంబర్లు.. 7995681678, 7995865456, 9177927677ను ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.






