- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆన్‌లైన్ విద్య పేరిట దోచుకుంటున్నారు
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో: ఆన్‌లైన్ విద్య పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. రకరకాల పేర్లతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు వ్యతిరేకంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్లు, చక్రధరరావు, హరగోపాల్, లక్ష్మీనారాయణ తెలిపారు. జీఓ 46ను ఉల్లంఘించి డబ్బులు వసూలు చేసే స్కూల్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు […]</p>

X
దిశ, న్యూస్బ్యూరో: ఆన్‌లైన్ విద్య పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. రకరకాల పేర్లతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు వ్యతిరేకంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్లు, చక్రధరరావు, హరగోపాల్, లక్ష్మీనారాయణ తెలిపారు. జీఓ 46ను ఉల్లంఘించి డబ్బులు వసూలు చేసే స్కూల్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వ జీవోలను ఉల్లంఘించి తల్లిదండ్రులను దోపిడీ చేసే ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలను గుర్తించి ఎంఈఓ, డీఈలకులకు మెమోరాండం సమర్పించాలని కమిటీ జిల్లా శాఖలు, సభ్య సంఘాలను కోరారు.
Next Story






