- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీకి షాక్.. దాదాపు ఆ నియోజకవర్గం మొత్తం ఖాళీ..
by Shyam |
<p>దిశ, పటాన్‌చెరు: టీడీపీకి సంగారెడ్డి జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత, రాష్ట్రంలో టీడీపీ పార్టీ పూర్తిగా బలహీన పడింది. కానీ సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం గట్టి పోటీనిస్తూ వస్తోంది. దీనికంతటికీ కారణం పటాన్‌చెరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, అమీన్‌పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ అనేది బహిరంగ రహస్యమే. అయితే తాజాగా తెలంగాణలో పార్టీ పరిస్థితుల దృష్ట్యా సోమవారం ఎడ్ల రమేష్ ఊహించని విధంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. […]</p>

X
దిశ, పటాన్‌చెరు: టీడీపీకి సంగారెడ్డి జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత, రాష్ట్రంలో టీడీపీ పార్టీ పూర్తిగా బలహీన పడింది. కానీ సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం గట్టి పోటీనిస్తూ వస్తోంది. దీనికంతటికీ కారణం పటాన్‌చెరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, అమీన్‌పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ అనేది బహిరంగ రహస్యమే. అయితే తాజాగా తెలంగాణలో పార్టీ పరిస్థితుల దృష్ట్యా సోమవారం ఎడ్ల రమేష్ ఊహించని విధంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఎలకొండ మల్లారెడ్డి, ఎడ్ల సంధ్య, బాలక్రిష్ణ, రవీందర్, లక్ష్మయ్య, నర్సింహా, రాకేష్ తదితరులు ఉన్నారు.
Next Story






